వీడు మామూలోడు కాదు.. గుడిలో దర్జాగా మూట కట్టుకుని చోరీ

వీడు మామూలోడు కాదు.. గుడిలో దర్జాగా మూట కట్టుకుని చోరీ

 తెలంగాణ వ్యాప్తంగా ఆలయాల్లో చోరీలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. కొందరు శివారులోని ఆలయాలను టార్గెట్ చేసుకుని విగ్రహాలు, గుడిలోని సామాగ్రిని ఎత్తుకెళ్తున్నారు. లేటెస్ట్ గా జగిత్యాల జిల్లా మెట్ పల్లిలోని పురాతన ఆలయమైన కాశీబాగ్ ఆంజనేయ స్వామి ఆలయంలో  ఓ దంగా దర్జాగా దూరి గర్భగుడిలోని సామాగ్రిని ఎత్తుకెళ్ళాడు. ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.

ALSO READ | ఆలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద నిఘా పెట్టాలి: సీపీ ఆదేశం

అక్టోబర్ 29న తెల్లవారుజామున 4 గంటల సమయంలో  ఓ వ్యక్తి  ముఖానికి గుడ్డ కట్టుకుని ఇనుపరాడుతో ఆలయంలోకి వచ్చిన దొంగ ముందుగా  గర్భగుడి తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లాడు. దర్జాగా పంచెలో పూజా సామాగ్రిని పంచెలో కట్టుకొని వెళ్లిపోయాడు.  ఆలయంలోని  సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గత కొన్ని నెలల క్రితం ఇదే ఆలయంలో చోరీ జరిగింది.