అన్నపురెడ్డిపల్లి, వెలుగు : భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లిలోని కీర్తి మెడికల్ షాపు లో శుక్రవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. మూసి ఉన్న షెట్టర్ తాళాలు పగులగొట్టి లోపలికి దూరి.. షాపులో ఉన్న రూ.1.30 లక్షల
నగదును దొంగిలించినట్లు షాపు యజమాని ఉమామహేశ్వరావు తెలిపారు. కొత్తగూడెం క్లూస్టీ సభ్యులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వేలిముద్రలు సేకరించారు.బాధితుని పిర్యాదు మేరకు ఎస్ఐ షాహినా దర్యాప్తు చేస్తున్నారు.