భైంసాలోని నాగదేవత ఆలయంలో చోరీ

భైంసాలోని నాగదేవత ఆలయంలో చోరీ
  • బంద్​కు పిలుపునిచ్చిన హిందూ దేవాలయ 
  • పరిరక్షణ సమితి

భైంసా, వెలుగు: భైంసా పట్టణ శివారులోని నాందేడ్​ వెళ్లే మార్గంలో ఉన్న నాగదేవత ఆలయంలో మంగళవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆలయ మెయిన్​ గేటు తాళాన్ని పగులకొట్టి హుండీలోని కానుకలను దోచుకెళ్లారు. ఉదయం 9 గంటలకు స్థానికులు ఆలయానికి వెళ్లగా.. చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు.

హిందూవాహిని ప్రతినిధి చింతపండు మహేశ్, హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు పెండెప్ కాశీనాథ్​ తదితరులు ఆలయానికి చేరుకున్నారు. ఆలయాల్లో వరుస చోరీలు జరుగుతున్నా పోలీసులు అరికట్టడంలేదని మండిపడ్డారు. ఆలయ నిర్వాహకులు భోజారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ గోపీనాథ్ తెలిపారు. హిందూ ఆలయాల్లో చోరీలను నిరసిస్తూ హిందూ దేవాలయ పరిరక్షణ సమితి భైంసా బంద్​కు పిలుపునిచ్చింది 

నిందితులను కఠినంగా శిక్షించాలి

నాగదేవత ఆలయంలో చోరీకి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే రామారావు పటేల్ డిమాండ్ చేశారు. మీడియాతో మాట్లాడుతూ పోలీసులు సమగ్ర దర్యాప్తు జరపాలన్నారు. ఆలయాల్లో దొంగతనాలపై జిల్లా ఎస్పీ జానకి షర్మిలాతో మాట్లాడినట్లు చెప్పారు. వెంటనే దోషులను పట్టుకోవాలని, సమగ్ర దర్యాప్తు జరపాలన్నారు.