
- మూడు చోట్ల గ్యాస్ కట్టర్లతో కట్ చేసి దోపిడీ
- సీసీ కెమెరాలపై వైట్ పెయింట్ స్ప్రే
- ఎంత క్యాష్ పోయిందో చెప్పని పోలీసులు
సదాశివపేట, వెలుగు : సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో దొంగలు ఏటీఎంలను టార్గెట్ చేశారు. ఒకే రోజు మూడు ఎస్బీఐ ఏటీఎంలను ధ్వంసం చేసి డబ్బులు ఎత్తుకు వెళ్లారు. సీసీ కెమెరాల్లో రికార్డు కాకుండా కెమెరాలకు వైట్ పెయింట్స్ప్రే చేసి మరీ నగదు దొంగిలించారు. బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పట్టణంలోని బసవేశ్వర మందిరం, గాంధీ చౌక్, గర్ల్స్ హైస్కూల్వద్ద ఉన్న ఏటీఎంలను గ్యాస్కట్టర్లతో ఓపెన్ చేశారు. తర్వాత అందులోని డబ్బునంతా ఎత్తుకెళ్లారు. ఎంత నగదు పోయిందన్నది మాత్రం తెలియరాలేదు. కాగా, ఘటనపై మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు సీఐ నవీన్‌కుమార్, డీఎస్పీ రవీందర్‌రెడ్డికి కాల్ చేయగా స్పందించలేదు.
సదాశివపేటలో వరస దొంగతనాలు
సదాశివపేటలో వరుస దొంగతనాలు జరుగుతు న్నాయి. ఇంటి ముందు బైకులతో పాటు ఆదివారం, బుధవారం సంతల్లో దొంగలు సెల్ఫోన్లు మాయం చేస్తున్నారు. బస్టాండ్‌లో బస్సెక్కుతున్నప్పుడు, దిగుతున్నప్పుడు సెల్ఫోన్లు కొట్టేస్తున్నారు. రికవరీ కోసం పీఎస్‌లకు వెళ్లినా ప్రయోజనం ఉండడం లేదని బాధితులు వాపోతున్నారు.