జోగులాంబ గద్వాల జిల్లాలో రెండు పెట్రోల్​ బంకుల్లో చోరీ

జోగులాంబ గద్వాల జిల్లాలో రెండు పెట్రోల్​ బంకుల్లో చోరీ

అయిజ, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. మల్దకల్ మండలం అమరవాయి సమీపంలోని ఇండియన్ ఆయిల్​ పెట్రోల్  బంక్, అయిజలోని హెచ్ పీ పెట్రోల్  బంకుల్లో చోరీ చేశారు. శుక్రవారం తెలవారుజామున అమరవాయి బంక్​లో మేనేజర్  రూమ్  అద్దాలు పగులగొట్టి సిబ్బందిని బెదిరించి‌ రూ.1.20 లక్ష ల నగదు ఎత్తుకెళ్లారు.

అయిజ బంక్​లో స్టాఫ్​ రూమ్ పై రాళ్లతో దాడి చేసి, సిబ్బందిని కత్తులతో బెదిరించి కౌంటర్ లో ఉన్న రూ. లక్ష  నగదు, సీసీ కెమెరాల హార్డ్  డిస్క్​ను ఎత్తుకెళ్లారు. సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. తేరుకున్న సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటన జరిగిన తీరును అడిగి తెలసుకున్నారు. ఈ రెండు ఘటనలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.