టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఇంట్లో శుక్రవారం (జనవరి 16) చోరీ జరిగింది. పంచకులలోని మానసా దేవి కాంప్లెక్స్‌లోని తమ ఇంట్లో నగదు, నగలు మాయమైనట్లు యువరాజ్ తల్లి షబ్మాన్ సింగ్ చెప్పుకొచ్చింది. తమ ఇంట్లో దొంగతనం జరగడంతో యువీ తల్లి పంచకుల పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ ఇంటిలో నుంచి 70,000 విలువైన నగదు, నగలు చోరీకి గురయ్యాయని.. ఇద్దరు సిబ్బంది దొంగతనం చేశారని ఆమె తన ఫిర్యాదులో వెల్లడించారు.
సాకేత్రికి చెందిన లలితా దేవి, ఇంటి పనిమనిషి సలీందర్ దాస్ ఈ దొంగతనానికి కారణమని ఆమె ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు ప్రకారం.. ఇద్దరూ ఇంటిని విడిచిపెట్టిన సుమారు ఆరు నెలల తర్వాత ఆమె ఈ దొంగతనం గమనించింది. 2023 చివరలో గురుగ్రామ్‌లో ఉంటున్నప్పుడు నిందితుడి సంరక్షణలో నెలపాటు తన ఇంటిని విడిచిపెట్టినట్లు పోలీసులకు తెలిపారు. ఫిబ్రవరి 15న మానసా దేవి కాంప్లెక్స్‌లో సెక్షన్ 381 కింద కేసు నమోదు చేయబడింది.
17 సంవత్సరాల పాటు యువరాజ్ సింగ్ భారత జట్టుకు సేవలను అందించాడు. యువీ భారత జట్టులో ఉన్నప్పుడు 2007 టీ20 ప్రపంచ కప్ తో పాటు, 2011లో వన్డే వరల్డ్ కప్ గెలుచుకుంది. ఈ రెండు వరల్డ్ కప్ లు గెలవడంలో యువరాజ్ సింగ్ కీలక పాత్ర పోషించాడు. 2007 టీ 20 వరల్డ్ కప్ సెమీస్ లో యువీ ఆస్ట్రేలియా మీద ఆడిన ఇన్నింగ్స్, 2011 లో క్వార్ట్రర్ ఫైనల్లో ఆసీస్ పై ఆడిన ఇన్నింగ్స్ కెరీర్ లోనే హైలెట్ గా నిలిచాయి. 2011 లో యువీ క్యాన్సర్ తో పోరాడి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచిన సంగతి తెలిసిందే.