యాదాద్రి భువనగిరిలో బంగారం షాపులో చోరీ..ఏడు తులాల గోల్డ్ మాయం

యాదాద్రి భువనగిరి జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. అర్థరాత్రి గోల్డ్ షాపులో దొంగతనానికి పాల్పడ్డారు. షెట్టర్ పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. విలువైన బంగారు  ఆభరణాలు ఎత్తుకెల్లారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రమైన భువనగిరిలో లక్ష్మీ జువెల్లర్స్ బంగారం షాపులో అర్థరాత్రి దొంగలు చోరీ చేశారు. షట్టర్ విరగ్గొట్టి లోపలికి చొరబడ్డారు. షాపులో ఉన్న ఏడు తులాల బంగారం, ఐదున్నర కేజీల వెండిని ఎత్తుకెళ్ళారు. గుర్తుతెలియని చోరీకి ప్రాల్పడుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.