ఉల్లిగుండంలోని ఇంట్లో చోరీ

ఉల్లిగుండంలోని ఇంట్లో చోరీ

నారాయణపేట, వెలుగు : ఓ ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడిన ఘటన దామరగిద్ద మండలం ఉల్లిగుండం గ్రామంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చంద్రోళ్ల వెంకటప్ప కుటుంబ సభ్యులతో కలిసి రెండు రోజుల క్రితం ఇంటికి తాళం వేసి మన్యంకొండ జాతరకు వెళ్లాడు. ఇది గమనించిన దొంగలు ఇంటి తాళం పగలగొట్టి ప్రవేశించి బీరువాలో ఉన్న రూ.లక్షా 20 వేల నగదు, తులం బంగారు దోచుకున్నారు. 

అనంతరం పక్కింటి తాళాలు పగలగొడుతుండగా శబ్ధం రావడంతో స్థానికులు లేచి చూసేసరికి దొంగలు ద్విచక్ర వాహనాన్ని (కేఏ 32, హెచ్​ఏ 7310) అక్కడే వదిలేసి పారిపోయారు. వెంటనే 100కు డయల్ చేయగా ఏఎస్ఐ అరుణ్, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.