దొంగతనాలు ఇవాళ, రేపు కామన్ అయిపోయాయి.అడుగడుగునా సీసీ కెమెరాలు ఉంటున్నప్పటికీ దొంగలు మాత్రం తగ్గేదేలే అంటున్నారు.అదీ, ఇదీ అన్న తేడా లేకుండా ఇంట్లో సామాన్ల నుండి గుడిలో గంట వరకూ ఏది దొరికితే అది దొంగిలిస్తుంటారు.కానీ, నిత్యం సీసీ కెమెరాల పర్యవేక్షణ, పోలీసుల పహారా ఉండే చార్మినార్ సమీపంలోని ఓ సెల్ పాయింట్లో 2లక్షల విలువ చేసే మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రిక్ సామాన్లు ఎత్తుకెళ్లారంటే ఒకింత ఆశ్చర్యంగానే ఉంది.
వివరాల్లోకి వెళితే, శుక్రవారం ( 27జూన్ 2024 ) అర్థరాత్రి చార్మినార్ సమీపంలోని ఓ మొబైల్ షాప్ లో దొంగతనం జరిగింది.పోలీసుల కధనం ప్రకారం ఇద్దరు మైనర్లు శుక్రవారం అర్థరాత్రి 2గంటల సమయంలో మూసి ఉన్న మొబైల్ షాపు షట్టర్లు బద్దలు కొట్టి చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది.
నిత్యం పోలీసుల పెట్రోలింగ్ ఉండే చార్మినార్ ఏరియాలో బస్టాప్ కి ఎదురుగా ఉన్న మూవీ ప్లానెట్ అనే మొబైల్ షాపులో ఈ చోరీ జరిగింది. ఈ చోరీలో 2లక్షల రూపాయల విలువ చేసే మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రిక్ సామాన్లతో పాటు కొంత నగదు కూడా చోరీకి గురైనట్లు తెలుస్తోంది.