
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలోనే చోరీ చేశారు. పార్టీ ఆఫీసులో ఉన్న రెండు కంప్యూటర్లను దొంగలు ఎత్తుకెళ్లారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఖాళీ చేసి ఫర్నీచర్ ను ను పార్టీ ఆఫీసుకు తరలించారు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. దీంతో పార్టీ ఆఫీస్ దగ్గర ఎలాంటి సెక్యూరిటీ లేకపోవడంతో రెండు కంప్యూటర్లను చోరీ చేశారు దుండగులు. దీనిపై బీఆర్ఎస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.