బచ్చన్నపేట దుర్గమ్మ గుడిలో దొంగతనం

బచ్చన్నపేట, వెలుగు :  మండలంలోని కొన్నె గ్రామ దుర్గమ్మ గుడిలో గురువారం వేకువ జామున చోరీ జరిగింది.  పూజారి  నిర్మల లింగం  వివరాల ప్రకారం... బుధవారం రాత్రి ఆయన గుడికి తాళం వేసి ఇంటికి వెళ్లాడు. ఏకాదశి   కావడంతో గురవారం తెల్లవారుజామునే గుడిని శుభ్రం చేయడానికి వచ్చేసరికి  తాళం పగులగొట్టి తలుపులు తీసి ఉన్నాయి. భక్తులు దుర్గమ్మతల్లికి చేయించిన వెండి కండ్లు, హుండీనీ దొంగలు ఎత్తుకెళ్లారు. హుండీలో  ఎక్కువ  నగదు ఉన్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు. ఈ మేరకు సర్పంచ్​ వేముల వెంకట్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.