
భైంసా, వెలుగు: నిర్మల్ జిల్లా భైంసాలోని ఏకముఖ హనుమాన్ఆలయంలో బుధవారం అర్ధరాత్రి దొంగలు పడ్డారు. ఆలయం గేటు తాళం, హుండీని పగులగొట్టి అందులోని నగదును ఎత్తుకెళ్లారు. ఆలయ కమిటీ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజారెడ్డి తెలిపారు. రెండ్రోజుల క్రితం నేతాజీ నగర్లోని రమేశ్, సాయినాథ్ ఇండ్లలోనూ చోరీ జరిగింది. రాత్రి వేళల్లో పోలీసులు గస్తీ ముమ్మరం చేయాలని స్థానికులు కోరుతున్నారు.