ఒకేసారి నాలుగు ఇళ్లలో చోరీ.. భారీగా బంగారు, వెండి ఆభరణాలు మాయం..

ఒకేసారి నాలుగు ఇళ్లలో చోరీ.. భారీగా బంగారు, వెండి ఆభరణాలు మాయం..

రంగారెడ్డి జిల్లా బండ్లగూడలో భారీ చోరీ కలకలం రేపింది.. బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలోని హైదర్ షాకోట్ విలేజ్, శాంతి నగర్ లో దొంగలు రెచ్చిపోయారు. ఒకేసారి నాలుగు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు కేటుగాళ్లు. ఇళ్ల తాళాలు పగులగొట్టి బంగారు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు దొంగలు. ఇళ్లలో ఎవరు లేని సమయం చూసి చోరీకి పాల్పడ్డట్టు తెలుస్తోంది. సోమవారం ( ఏప్రిల్ 28 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.

ఓ ఇంట్లో తులం బంగారం ఆభరణాలు చోరి చేసిన దొంగలు.. మరో ఇంట్లో 2 బంగారు ఉంగరాలు, 2 చెవిదిద్దులు, వెండి చైన్ చోరి చేసినట్లు తెలుస్తోంది. పెళ్ళికి వెళ్లిన మరో ఇల్లు గుల్ల చేశారు కేటుగాళ్లు. 9.5 తులాల నెక్లెస్, మంగళ సూత్రాలు ఎత్తుకెళ్లారు.మరో ఇంటి తాళాలు పగులగొట్టి బంగారు నగల్ని కాజేసి ఉడాయించారు. దీంతో లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.