
జగిత్యాల జిల్లా, కొండగట్టు అంజన్న ఆలయ నిత్య అన్నదాన సత్రంలో దొంగతనం కలకలం రేపింది. అన్నదాన సత్రం ఇన్‌ఛార్జ్ రాములు (జూనియర్ అసిస్టెంట్) దొంగతనం చేశాడని ఆలయ అధికారులు గుర్తించారు. ఈ నెల 9న బియ్యం బస్తాలు, ఇతర వస్తువులు తీసుకెళ్లినట్టు సీసీటీవీ ఫుటేజ్‌ల సాయంతో గుర్తించిన అధికారులు సంబంధిత అధికారికి మెమో జారీ చేశారు. విచారణ అనంతరం శాఖపరమైన చర్యలు తీసుకుంటామని ఆలయ ఏఈఓ అంజయ్య తెలిపారు.