కొండగట్టు: జగిత్యాల జిల్లా కొండగట్టు హుండీ లెక్కింపులో దొంగతనం జరిగింది. కొద్ది రోజుల క్రితం ఆలయంలో లెక్కింపు సందర్భంగా జరిగిన బంగారం దొంగతనాన్ని మరువకముందే టెంపుల్ ఉద్యోగి దొంగతనానికి పాల్పడ్డాడు. ఇవాళ ఆలయ అధికారులు కొండగట్టులో హుండీల లెక్కింపు చేపట్టారు. ఈ సందర్భంగా కొండగట్టు లడ్డు తయారు కేంద్రంలో పనిచేసే ఉద్యోగి రవి కూడా లెక్కింపులో పాల్గొన్నాడు.
11 వేల పది రూపాయలను లెక్కింపు చేస్తున్నట్టు నటించి దొంగతనంగా తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. దీన్ని గమనించిన తోటి ఉద్యోగులు అధికారులకు సమాచారం అందించారు. రవి వేసుకున్న దుస్తులను సోదా చెయ్యగా 500 రూపాయల నోట్లు 22, ఇకటి పది రూపాయల నోట్లు అతని వద్ద లభించాయి. దీంతో అధికారులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.