జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయ హుండీ లెక్కింపులో దొంగతనం జరిగింది. ఏకంగా రూ. 10 వేల నగదును ఎత్తుకెళ్లారు. లడ్డు తయారీలో పని చేసే ఉద్యోగి ఈ దొంగతనం చేశాడని పోలీసులు గుర్తించారు. రూ. 10 వేల నగదును ఆలయంలో పని చేసే ఉద్యోగి దొంగిలించడంతో.. పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఉద్యోగిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కాగా గతంలో కూడా కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానం దొంగతనాలు జరిగాయి. అయితే.. కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానం పరిధిలో భద్రతపై మొదటి నుంచి డొల్లతనం కనిపిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. కొండగట్టులో ఒక్క ఏఎస్సై, హోంగార్డులు, ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది భద్రత చూస్తుంటారు.