అన్నోజిగూడలో మొబైల్ షాపులో చోరీ

అన్నోజిగూడలో మొబైల్ షాపులో చోరీ

ఘట్​కేసర్, వెలుగు: పోచారం మున్సిపాలిటీ పరిధి అన్నోజిగూడలోని ఓ మొబైల్ షాపులో చోరీ జరిగింది. మంగళవారం తెల్లవారుజామున ఎస్ఎల్ఎన్ మొబైల్ షాపు తెరిచి ఉండడంతో షాపు నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో క్రైమ్ డీసీపీ అరవిందబాబు సిబ్బందితో కలిసి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మొత్తం 67 స్మార్ట్​ఫోన్లు, ఎల్ఈడీ టీవీలు, బ్రాండెడ్ యాక్సెసరీస్ చోరీకి గురైనట్లు గుర్తించారు. షాపులో రక్తపు మరకలు ఉండడంతో చోరీ చేసిన దొంగల్లో ఒకరికి గాయాలైనట్లు  తెలుస్తున్నది.