
నిజామాబాద్ నుంచి తిరుపతి వెళ్లే రాయలసీమ ఎక్స్ ప్రెస్ లో భారీ చోరీ జరిగింది.. సోమవారం ( ఏప్రిల్ 28 ) గుత్తి స్టేషన్ దగ్గర రైలు ఆగి ఉండగా చోరీ జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.. సోమవారం అర్థరాత్రి 1: 30 గంటల సమయంలో అమరావతి ఎక్స్ ప్రెస్ కు లైన్ క్లియర్ చేసేందుకు గుత్తి శివారులో రాయలసీమ ఎక్స్ ప్రెస్ నిలిపిన సమయంలో ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
రైలు ఆగిన సమయంలో చొరబడ్డ ఐదుగురు దుండగులు 10 బోగీల్లో దోపిడీకి పాల్పడినట్లు సమాచారం. ప్రయాణికులకు చెందిన బంగారం, నగదుతో పాటు భారీగా విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు దుండగులు. ఈ ఘటనపై 20మంది బాధితులు తిరుపతి రైల్వే స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.