దొంగతనం చేశాక రైలునుంచి బయటకు తోసేశారు

దొంగతనం చేశాక రైలునుంచి బయటకు తోసేశారు

రైలులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తినుంచి నగదును దోచుకుని కదిలే రైలు నుంచి తోసేశారు కొందరు దుండగులు. ఈ ఘటన అనంతపురం జిల్లా గుంతకల్లు సమీపంలోని తిమ్మనచర్ల రైల్వేస్టేషన్‌లో ఆదివారం పొద్దున జరిగింది. కర్ణాటక రాష్ట్రం హొస్పేటకు చెందిన గోవిందప్ప మంత్రాలయం వెళ్లేందుకు బెంగుళూరు నుంచి నాందేడ్‌కు వెళ్లే నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ప్రయాణిస్తున్నాడు. రైలు తిమ్మనచర్ల రైల్వేస్టేషన్‌కు రాగానే గుర్తుతెలియని ముగ్గురు దుండగులు గోవిందప్ప వద్దనున్న రూ.50వేలు గుంజుకుని రైలునుంచి కిందకు తోసేశారు. దీంతో గోవిందప్ప తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతన్ని గుంతకల్లు గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. సమాచారాన్ని రైల్వే పోలీసులకు అందజేయగా… కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.