మంగపేట, వెలుగు : మండలంలోని కమలాపురం సాయిబాబా, సీతారామచంద్ర స్వామి ఆలయాల్లో బుధవారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది. అర్చకులు, ఆలయ కమిటి సభ్యుల వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి సాయిబాబా ఆలయంలో కొందరు ప్రధాన ద్వారం పగులగొట్టి హుండీని ఎత్తుకెళ్లారు. సుమారు రూ.30వేల నుంచి 40వేల వరకు కానుకలు ఉంటాయని అంచనా వేస్తున్నారు.
అలాగే సీతారామచంద్ర స్వామి ఆలయంలో హుండీని కూడా దొంగలు పగలగొట్టి కానుకలు ఎత్తుకెళ్లినట్టు తెలిపారు. ఎస్సై రవికుమార్ ఘటనాస్థలాలను పరిశీలించారు. సీసీ కెమెరాల ఆధారంగా దొంగలను గుర్తించిన పోలీసులను వారిని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నట్లు సమాచారం.