సారంగాపూర్ లో ఆలయాల్లో చోరీ

సారంగాపూర్, వెలుగు : రెండు ఆలయాల్లో హుండీలు, ఆభరణాలను దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల పరిధిలో జరిగింది. ఎస్సై కృష్ణ సాగర్  రెడ్డి  తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని హనుమాన్ తండా, బొరిగాం తండాలోని జగదాంబ ఆలయాల్లో చోరీ జరినట్లు స్థానికులు గుర్తించారు. హనుమాన్ తండా ఆలయ పూజారి చౌహాన్ శేషారావు ఫిర్యాదు మేరకు పోలీసులు ఆలయాల వద్దకు వచ్చి విచారణ చేపట్టారు.

వెండి, బంగారు ఆభరణాలు, హుండీలను దుండగులు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. క్లూస్ టీంతో ఆలయాల పరిసరాలను పరిశీలించారు. ఆభరణాల విలువ సుమారు రూ.90 వేలకుపైగా ఉంటుందని భావిస్తున్నారు.