
వికారాబాద్ జిల్లా పెరిగిలోని భవాని వైన్ షాపులో శనివారం ( మార్చి 2, 2025 ) అర్థరాత్రి చోరీ జరిగింది. వైన్ షాపు కౌంటర్లో డబ్బులతో పాటు బీర్లు కూడా పట్టుకెళ్లారు కేటుగాళ్లు. వైన్ షాపుకు ఉన్న తాళాలు కట్ చేసి లోపలికి దూరిన దొంగలు కౌంటర్లో దాదాపు రూ. 2 లక్షల 30 వేల రూపాయలు నగదు దోచుకెళ్లినట్లు తెలుస్తోంది. డబ్బులతో పాటు పోతూ పోతూ రెండు బీర్లు కూడా పట్టుకెళ్లారని వైన్ షాపు సిబ్బంది చెబుతున్నారు.
రాత్రి షాపు మూసే సమయానికి లెక్కలు చూసి తాళాలు వేసి వెళ్ళిపోయామని...మళ్ళీ ఉదయం వచ్చి చూసేసరికి తాళాలు పగలగొట్టి ఉన్నాయని తెలిపారు సిబ్బంది. దొంగల కదలికలన్ని సిసి కెమారాల్లో రికార్డయ్యాయి.వైన్స్ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. సిసి ఫుటేజ్ ఆధారంగా, క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేస్తున్నారు. వీకెండ్ పరిగిలో ఏదోఒక చోట చోరీలు జరగడం సర్వసాధారణంగా మారిందని అంటున్నారు.