కరీంనగర్ జిల్లాలో వైన్స్లో చోరీ.. ఎవిడెన్స్ లేకుండా వీళ్లు చేసిన ప్లాన్కు నోరెళ్లబెట్టాల్సిందే

కరీంనగర్ జిల్లాలో వైన్స్లో చోరీ.. ఎవిడెన్స్ లేకుండా వీళ్లు చేసిన ప్లాన్కు నోరెళ్లబెట్టాల్సిందే

కరీంనగర్ జిల్లాలో వైన్స్ షాప్ లో జరిగిన చోరీ చర్చనీయాంశం అయ్యింది. దుండగులు మందు బాటిళ్ల కోసం చేసిన పని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు స్థానికులు. వైన్స్ షాప్ షెడ్ పై భాగంలోని రేకులను సినీ ఫక్కిలో కత్తిరించి చోరీకి పాల్పడ్డారు. దీనికి తోడు ఎవిడిన్స్ లేకుండా చేయాలనుకుని చేసిన పనిని చూస్తే ఎంతగా ఆరితేరారు దొంగలు అనిపించకమానదు.

వివరాల్లోకెళ్తే.. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్ క్రాస్ వద్ద దుర్గా వైన్స్ లో చోరీ జరిగింది. పై కప్పు రేకులను కత్తిరించి మద్యం బాటిల్లతోపాటు నగదును ఎత్తుకెళ్లారు దొంగలు. షాప్ నిర్వాహులు పోలీసలకు సమాచారం ఇవ్వటంతో ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. 

Also Read :- నలుగురు పిల్లలను గొంతు కోసి చంపి.. తాను కూడా

చోరీ సందర్భంగా దుండగులు సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అంతేకాకుండా ఎవిడెన్స్ దొరకకుండా చేసేందుకు సీసీ కెమెరా ఫుటేజ్ బాక్సులను ఎత్తుకెళ్లారు. అలాగే ఇన్వర్టర్ ను కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. ఇంత చేసి దొంగలు ఎత్తుకెళ్లింది కేవలం రెండు బీర్ బాటిళ్లే కావడం చర్చనీయాంశం అయ్యింది. పెద్ద ఎత్తున నగదుపై టార్గెట్ చేసిన దుండగులు.. నగదు ఎక్కువగా లభ్యం కాకపోవడంతో రెండు బాటిళ్లను ఎత్తికెళ్లినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.