వైన్స్లో దొంగతనం.. రూ. 3 లక్షలు ఎత్తుకెళ్లిన్రు

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలోని దుర్గ వైన్స్ లో మార్చి 23 వ తేదీన  దొంగతనం జరిగింది. అర్థరాత్రి షట్టర్ పగలగొట్టి  దొంగతననానికి పాల్పడ్డారు.  సుమారు మూడు లక్షల రూపాయల నగదు దొంగిలించి ఊడాయించారు. దొంగతనం జరిగిన విషయం గమనించిన వైన్స్ యజమానులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు.