
లింగంపేట,వెలుగు: లింగంపేట మండలం శెట్పల్లిసంగారెడ్డి గ్రామ శివారులో గల రెండు ట్రాన్సుఫార్మర్లను ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసి ఆయిల్, కాపర్‌వైర్‌ను చోరీ చేసినట్లు ఏఈఈ హరీశ్‌రావు తెలిపారు. లింగంపేట - గోపాల్పేట మెయిన్ రోడ్డు పక్కన వ్యవసాయ బోర్బావులకు కరెంట్ సరఫరా చేసేందుకు అమర్చిన ట్రాన్సుఫార్మర్లను ధ్వంసం చేశారని చెప్పారు. చోరీకి గురైన కాపర్ వైర్, ఆయిల్ విలువ సుమారు రూ. లక్ష ఉంటుందని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.