మనోహరాబాద్ వైన్స్​లో చోరీ.. రూ. 80 వేల మద్యం బాటిళ్లు లూటీ

మనోహరాబాద్, వెలుగు: మండలంలోని కాళ్లకల్ గ్రామ శివారులో గల వైన్స్​లో బుధవారం చోరీ జరిగింది. ఎస్సై కరుణాకర్ రెడ్డి ప్రకారం.. కాళ్లకల్ గ్రామంలోని వెంకటేశ్వర వైన్స్ ను రోజు మాదిరిగా మంగళవారం రాత్రి క్లోజ్​ చేసి సిబ్బంది వెళ్లిపోయారు. 

ALSO READ: రుణమాఫీపై నిర్లక్ష్యం..బ్యాంకుల ముందు రైతుల ఆందోళన
 

బుధవారం ఉదయం వైన్స్ తెరవడానికి రాగా యజమాని సార సంతోశ్​గౌడ్ షెట్టర్​ కొంచెం తెరిచి ఉండటం గమనించాడు. వెంటనే పార్టనర్ దామోదర్ రెడ్డిని పిలిచి ఓపెన్ చేసి చూడగా సుమారు రూ. 80 వేల మద్యం బాటిళ్లు కనిపించలేదు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.