కొండగట్టులో జరుగుతున్న వరుస దొంగతనాలు పోలీసులకు సవాల్ గా మారుతున్నాయి. దొంగతనం జరిగిన 24 గంటల్లోనే పోలీసులు దొంగలను పట్టుకుంటున్నా.. దొంగతనాలు మాత్రం ఆగడం లేదు. కొద్ది రోజుల క్రితం కొండగట్టు గుట్ట పైన గుడిలో, సత్రంలో జరిగిన వరుస దొంగతనాలను మరువక ముందే ఈసారి దొంగలు గుట్ట కింద ఎల్లమ్మ గుడిని టార్గెట్ చేశారు. దీంతోపాటు కోడిగుడ్ల లోడుతో ఇంటి ముందు పార్కు చేసిన ట్రాలీ ఆటో కూడా ఎత్తుకెళ్లారు.
మల్యాల ఎస్ఐ చిరంజీవి తెలిపిన వివరాల ప్రకారం గురువారం తెల్లవారు జామున కొండగట్టు దిగువ ప్రాంతంలో ఎల్లమ్మ గుడిలో కొండి చోరీ జరిగినట్లు గుడి అధ్యక్షుడు నవీన్ గౌడ్ తెలిపారు. హుండీలో ఉన్న సుమారు2000 నగదు ఎత్తుకెల్లినట్లు నవీన్ ఫిర్యాదు చేశాడు. దీంతోపాటు మోహన్ అనే వ్యక్తికి చెందిన కోడిగుడ్ల లోడుతో ఉన్న ట్రాలీ ఆటోను కూడా దొంగలు ఎత్తుకెళ్లారు. కాగా పోలీసులు దొంగల కోసం వేట ప్రారంభించారు. దొంగలు ఎత్తుకెళ్లిన ట్రాలీ సిసి ఫుటేజ్ లో రికార్డు కావడంతో వాటిని శుక్రవారం మీడియాకు రిలీజ్ చేశారు. దొంగలను పట్టుకోవడంలో సహాయపడవలసిందిగా ఎస్ఐ కోరారు.