
- 10 రోజుల పాటు అందుబాటులో..
మాదాపూర్, వెలుగు: ఆంధ్రప్రదేశ్ప్రొడక్టివిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో డెవలప్మెంట్ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ సౌజన్యంతో మాదాపూర్శిల్పారామంలో సమగ్ర హస్తకళల క్లస్టర్ అభివృద్ధి పథకం కింద థీమాటిక్ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. హ్యాండీక్రాఫ్ట్స్ డిపార్ట్ మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ సువర్చల, ఏపీఐటీసీఓ సీఈఓ విజయ్, ఏపీ ప్రొడక్టివిటీ కౌన్సిల్ డైరెక్టర్ జనరల్ శ్రీనివాస రఘు గురువారం ప్రారంభించారు.
10 రోజుల పాటు కొనసాగే ప్రదర్శనలో తెలుగు రాష్ట్రాలతోపాటు బిహార్, వెస్ట్ బెంగాల్, జమ్మూ కశ్మీర్ కు చెందిన 50 మంది హస్తకళాకారులు పాల్గొంటున్నారు. బొబ్బిన్ లేస్ స్టేషన్ ఘనాపూర్, పామ్ లీఫ్ క్రాఫ్ట్, కలంకారీ, ఇమిటేషన్ జ్యువెలరీ, కార్పెట్స్, క్రాస్ స్టిచ్ క్రాఫ్ట్ , మట్టి పాత్రలు తయారు చేయడం, జర్దోసి, బంజారా సూది పని, లక్క గాజులు, చెరియల్ స్క్రోల్ పెయింటింగ్ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి.