న్యూఢిల్లీ: వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియాతో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు వీవీఎస్ లక్ష్మణ్ ఇంచార్జ్ కోచ్‌గా వ్యవహరించే చాన్స్ ఉంది. మెగా ఈవెంట్‌తో హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసిపోతున్న నేపథ్యంలో.. కొత్త కోచ్ కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించాల్సి ఉంది. కాబట్టి కొత్త కోచ్ వచ్చేలోగా ఆసీస్‌తో సిరీస్‌కు వీవీఎస్‌కు బాధ్యతలు ఇవ్వాలని బీసీసీఐ యోచిస్తున్నది. మరోవైపు టీమిండియాకు రెండోసారి కోచ్‌గా పని చేసేందుకు 51 ఏళ్ల ద్రవిడ్ ఆసక్తి చూపిస్తాడా? నిరంతర ప్రయాణం, ఒత్తిడితో కూడుకున్న పోస్ట్ కావడంతో రెండోసారి దరఖాస్తు చేస్తాడా? లేదా? చూడాలి.
ఒకవేళ ద్రవిడ్ రేస్‌లో లేకపోతే కోచ్ పదవికి లక్ష్మణ్ బలమైన అభ్యర్థిగా మారే చాన్స్ ఉంది. ద్రవిడ్ తిరిగి ఐపీఎల్ కోచింగ్‌లోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అప్పుడు నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) హెడ్‌గా కొత్త వ్యక్తిని నియమించొచ్చు. మరోవైపు వచ్చే ఏడాది ఐపీఎల్ కోసం ప్లేయర్ల వేలాన్ని దుబాయ్‌లో నిర్వహించాలని భావిస్తున్నారు. ముంబై, బెంగళూరు కూడా రేస్‌లో ఉన్నా డేట్ ఖరారైన తర్వాత వేదికపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.