వివేక్​వెంకటస్వామి సమక్షంలో కాంగ్రెస్​లోకి భారీగా చేరికలు

కోల్​బెల్ట్, వెలుగు: పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్​అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపిస్తే ప్రజల కోసమే పనిచేస్తారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​వెంకటస్వామి అన్నారు. శుక్రవారం చెన్నూరు నియోజకవర్గం రామకృష్ణాపూర్​లోని శివాజీనగర్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు బీజేపీ లీడర్లు, పాడి రైతులు ఆయన సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. 

రాష్ట్ర సర్కార్​చేపట్టిన సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులైన బీజేపీ, బీఆర్ఎస్​ లీడర్లు పెద్ద ఎత్తున కాంగ్రెస్​లో చేరుతున్నారన్నారు. ప్రజలకు సేవ చేస్తాడనే నమ్మకంతో వంశీకృష్ణకు కాంగ్రెస్​ హైకమాండ్​ఎంపీ టికెట్​ఇచ్చిందని తెలిపారు. వంశీ గెలుపు కోసం కాంగ్రెస్​ లీడర్లు, కార్యకర్తలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. -కాంగ్రెస్​లో చేరిన వారిలో బీజేపీ బీసీ మోర్చా టౌన్​ప్రెసిడెంట్​వీరమల్ల పాలరాజయ్య, ఎస్సీ మోర్చా ప్రెసిడెంట్​బంగారి ప్రసాద్, జనరల్​సెక్రటరీ శివ, బూత్​అధ్యక్షుడు వేల్పుల రమేశ్​, సంతోశ్,  పాడిరైతుల సంఘం అధ్యక్షుడు పెంట రమేశ్​యాదవ్​, రాయమల్లు  తదితరులు ఉన్నారు.  

భీమారంలో బీఆర్ఎస్​కు షాక్

భీమారం మండలంలో బీఆర్ఎస్​కు షాక్​ తగిలింది. శుక్రవారం మంచిర్యాలలోని ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ, ఏడుగురు  మాజీ సర్పంచులు, వార్డు మెంబర్లు, సింగిల్​విండో సభ్యులతో పాటు 500 మంది బీఆర్ఎస్​ కార్యకర్తలు కాంగ్రెస్​లో చేరారు. ఎమ్మెల్యే వివేక్ వీరికి​ కాంగ్రెస్​కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మందమర్రిలో కాంగ్రెస్​ లీడర్ తుమ్మల​శ్రీనివాస్​ కూతురు హారిక సారీ ఫంక్షన్​కు హాజరై చిన్నారిని ఎమ్మెల్యే వివేక్​ఆశీర్వదించారు. రామకృష్ణాపూర్​లోని భగత్​సింగ్​నగర్​కు చెందిన కాంగ్రెస్​ లీడర్​ గూడ సత్తయ్య గృహాప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు.

పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కృషి చేస్తామని సింగరేణి రిటైర్డు కార్మికులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం మందమర్రిలోని జీఎం ఆఫీస్​ఏరియాలో పలువురు రిటైర్డు కార్మికులు ఎమ్మెల్యే వివేక్​వెంకటస్వామితో మాట్లాడారు. ప్రజా సేవ చేస్తున్న కాకా కుటుంబానికి తమ మద్దతు ఎప్పటికి ఉంటుందని, యువకుడైన వంశీకృష్ణకు అండగా  ఉంటామన్నారు.