తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా వాటి సంఖ్య 8కి చేరింది. రాష్ట్రంలో మొత్తం 8 ఒమిక్రాన్ కేసులు నమోదు అయినట్లు హెల్త్ డైరెక్టర్ డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. విదేశాల నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చినవారికి టెస్టులు నిర్వహించగా అందులో 9 మందికి ఒమిక్రాన్ సోకినట్లు గుర్తించామన్నారు. కాగా.. వీరిలో ఒక కేసు ఎయిర్ పోర్ట్ నుంచే తిరిగి వెళ్లిపోయినట్లు ఆయన తెలిపారు. మిగతా 8 కేసులు మన రాష్ట్రానికి చెందినవే అన్నారు. కొత్తగా నమోదైన రెండు కేసుల్లో ఒకటి హనుమకొండ జిల్లాలో నమోదు అయ్యింది. యూకే నుంచి వచ్చిన మహిళ(29)కు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అయితే ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఈ నెల 3న మహిళ యూకే నుంచి రాష్ట్రానికి వచచింది. దీంతో 11న ఆమె ఫ్యామిలి మొత్తానికి ఆర్టీ పీసీఆర్ టెస్టులు నిర్వహంచారు. 12న మహిళకు కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో 13వ తేదీన జీనోమ్ సీక్వెన్స్ కోసం ఆమె శాంపిల్స్ సేకరించిన జిల్లా అధికారులు హైదరాబాద్ కు పంపారు. దీంతో ఆమెకు ఈనెల 16 రాత్రి ఒమిక్రాన్ గా నిర్ధారణ అయ్యింది.
ఒమిక్రాన్ సోకిన వారంతా విదేశాల నుంచి వచ్చినవారే అన్నారు హెల్త్ డైరెక్టర్ డీహెచ్ . లోకల్ గా ఉన్న వారెవరికి ఒమిక్రాన్ సోకలేదన్నారు. ఒమిక్రాన్ విషయంలో ప్రజలు భయాందోళనలు చెందాల్సిన పనిలేదన్నారు. ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవడానికైనా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రజలంతా మాత్రం బాధ్యతగా వ్యవహరించాలన్నారు. కరోనా నిబంధనలు పాటించాలన్నారు. అసత్య ప్రచారాలు,వదంతులు నమ్మొద్దన్నారు. కేసులకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నామన్నారు. మీ గురించి మీకుటుంబం గురించి బాధ్యతతో మెలగాలన్నారు. కరోనా పూర్తిగా పోయేవరకు జాగ్రత్తగా ఉండాలన్నారు. 97 శాతం మంది ఫస్ట్ డోస్ తీసుకున్నారన్నారు, 11 జిల్లాల్లో వంద శాతం వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ పూర్తయ్యిందన్నారు. సెకండ్ డోస్ 56 శాతం పూర్తయ్యిందన్నారు.
ఇవికూడా చదవండి:
దేశ రాజధానిలో కొత్తగా 10 ఒమిక్రాన్ కేసులు