యునైటెడ్ స్టేట్స్లో దాదాపు ఐదు మిలియన్ల మంది భారతీయులు ఉన్నారట! ప్రపంచ దేశాలన్నింటిలో ఈ దేశంలోనే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఈ విషయాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ ఎఫైర్స్ ఈ మధ్య వెల్లడిచేసింది. యునైటెడ్ స్టేట్స్లోనే కాకుండా ఇతరదేశాల్లో కూడా మనవాళ్లు ఉంటున్నారు. వాటి విషయానికొస్తే... మారిషస్‌లో దాదాపు 70 శాతం, యునైటెడ్ కింగ్‌డమ్‌లో 1.8 శాతం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో 42 శాతం, సౌదీ అరేబియాలో10%, ఒమన్‌లో దాదాపు 20% ఇండియన్స్ ఉన్నారు. అబ్బో ఎక్కడ చూసినా మనవాళ్లే అనుకుంటున్నారా! అయితే మనవాళ్లు అడుగుపెట్టని దేశాలు కూడా కొన్ని ఉన్నాయి. వాటిని జీరో ఇండియన్ కంట్రీస్ అంటారు. అవి...
వాటికన్ సిటీ : ప్రపంచంలో అతి చిన్న దేశంగా పేరుగాంచిన వాటికన్ సిటీలో టూరిస్ట్‌లను మినహాయిస్తే.. అక్కడ భారతీయుల జనాభా ‘జీరో’ అని తేలింది.
శాన్ మారినో : ఇటలీ పర్వతాల్లో ఉండే ఈ దేశ చరిత్ర, అందం, కల్చర్ గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఇది గ్లోబల్‌గా టూరిస్ట్లని అట్రాక్ట్ చేస్తుంది. ఇక్కడి జనాభా 3, 35, 620.
తువాలు : ఇది నార్త్ ఈస్ట్‌లోని పసిఫిక్ సముద్రానికి దగ్గర్లో ఉండే దేశం. చాలా చిన్న దేశం అయిన తువాలుకి విదేశాల నుంచి టూరిస్ట్‌లు ఎక్కువగానే వెళ్తుంటారు. ఇక్కడ కూడా ఇండియన్స్లేరు.
ఎందుకంత ఇష్టం?
భారతీయలు విదేశాల్లో స్థిరపడేందుకు ఎందుకు ఇష్టపడుతున్నారు? అంటే.. అక్కడ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది అనేది మొదటి కారణం. ఆ తర్వాత కారణాలు.. ఆడవాళ్లకు, పిల్లలకు రక్షణ దొరుకుతుంది. ప్రతి ఒక్కరూ చట్టాలు పాటిస్తారు. ఎవరూ చట్టాల్ని ఉల్లంఘించడానికి సాహసించరు. అలాగే, పొల్యూషన్ లేకపోవడం కూడా ఒక కారణమే. ఇక వర్క్ ప్లేస్ విషయంలో కొలీగ్స్, అధికారుల మధ్య అసమానతలు ఉండవు. అందరూ సమానమే.
జనాభా ఎక్కువ ఉండడం వల్ల కూడా ఇబ్బందులు వస్తాయి. అలాంటివి ఆయా దేశాల్లో ఉండవు. ముఖ్యంగా ఫుడ్ కల్తీ అస్సలు ఉండదు. పిల్లల చదువు విషయంలో మోసాలు ఉండవు. అవినీతి ఉండదు. పాలిటిక్స్‌లో క్రైమ్ రేట్ ఉండదు. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. మత, కుల, భాష మీద రాజకీయాలు ఉండవు. అంతేకాదు.. భారతీయులు స్థిరపడిన ఆయా దేశాల్లో దోమల బెడద కూడా లేదు. మరి ఇన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా అక్కడే ఉండిపోవాలి అనిపిస్తుంది కదా!