రామగుండం కార్పొరేషన్​లో వెహికల్స్​ కొనుగోళ్లలో అక్రమాలు..విజిలెన్స్​ ఆఫీసర్ల ఎంక్వైరీ

గోదావరిఖని,వెలుగు:రామగుండం కార్పొరేషన్​లో వె హికల్స్​ కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలొస్తున్నాయి. శుక్రవారం విజిలెన్స్​ఆఫీసర్లు ఎంక్వైరీ చేయడం హాట్​టాపిక్​గా మారింది. శుక్రవారం హైదరాబాద్​కు చెందిన డీఈఈ వినోద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇన్​స్పెక్టర్ ​అనిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మరో ఇద్దరు ఏఈలు కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తనిఖీ చేశారు. పాత మున్సిపల్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెహికిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ను పరిశీలించారు. శానిటేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రికార్డులు తనిఖీ చేశారు. 

గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జరిగిందిలా?

రామగుండం కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శానిటేషన్​పనుల కోసం వివిధ వాహనాలు తీసుకున్నారు. రూ.88 లక్షల పట్టణ ప్రగతి నిధులు, రూ.6.25 కోట్ల 14వ ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫండ్స్​నుంచి 50 స్వచ్ఛ ఆటో ట్రాలీలు, ట్రక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మౌంటెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గార్బేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాంపాక్టర్లు, 11 వేల లీటర్ల కెపాసిటీ గల కాంపాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, ట్రక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మౌంటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్వీపింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, లిట్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పిక్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, శ్మశాన వాటికలు, రెండు పొర్టబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాంపాక్టర్లు, ఒక ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కావేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కార్డు‌‌‌‌‌‌‌‌, రాడింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొనుగోలు చేశారు. వీటిని 2020 జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి 2021 ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మధ్య కాలంలో టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆగ్రో ఇండస్ట్రీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా కొనుగోలు చేసినట్టు రికార్డు చేశారు. ఎలాంటి అగ్రిమెంట్లు, ఎంబీ రికార్డులు లేకుండానే టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆగ్రో సంస్థ ఇన్వాయిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపై బిల్లులు క్లెయిమ్​ చేశారు. ఏడాది దాటినా ఇందులో రూ.24.26 లక్షలతో ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కావేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొనుగోలు చేసి 2021 ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 24న బిల్లు చెల్లింపు, రూ.1.34 కోట్లతో రాడింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రెఫ్యూజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డు మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొనుగోలు చేసి 2021 జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 30న బిల్లులు చెల్లించారు. కానీ... ఈ వెహికిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇప్పటికీ రామగుండం కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరలేదు. కొనుగోలు చేసిన వెహికిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంటే 30 నుంచి 40 శాతం ఎక్కువ ధర చెల్లించినట్లు ఆరోపణలున్నాయి.

మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు అన్నీ మూలకే...

కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆగ్రో సంస్థ ద్వారా కొనుగోలు చేసిన వెహికిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చాలా వరకు మూలకే పడ్డాయి. రూ.45 లక్షలతో కొనుగోలు చేసిన సీవరేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జెట్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇటీవలే రిపేర్​కు నోచుకుంది. దీని స్పేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పార్ట్స్​  ఢిల్లీలోనే దొరుకుతుండడంతో మూలకు పడేశారు. ఇక రూ.1.05 కోట్లతో కొనుగోలు చేసిన స్వీపింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రూ.23.49  కోట్లతో కొనుగోలు చేసిన లిట్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫిక్కింగ్ మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కదలడంలేదు. పేరుకే ఆగ్రోస్‌‌‌‌‌‌‌‌  ఉన్నప్పటికీ మధ్యవర్తులు సుమారుగా రూ.60 నుంచి రూ.70 లక్షల వరకు వెనకేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. 


డీజిల్​ కుంభకోణంపై విచారణ చేయాలి


కరీంనగర్, వెలుగు:కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో జరుగుతున్న డీజిల్ కుంభకోణంపై విచారణ జరిపించాలని ప్రజాప్రయోజనాల పరిరక్షణ సమితి అధ్యక్షుడు, సామాజిక కార్యకర్త మొహమ్మద్​అమీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన కరీంనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. కొన్నేళ్లుగా జనరేటర్ లో పోసే డీజిల్ కోసం రూ.15  వేల నుంచి 20 వేలు ఖర్చు చేస్తున్నట్లు లెక్కలు చూపిస్తున్నారని, రెప్పపాటుకూడా కరెంటు పోవడం లేదని చెప్తున్న సర్కార్ హయాంలో జనరేటర్ కు డీజిల్ ఎలా ఖర్చు చేస్తున్నారని ప్రశ్నించారు. మరోవైపు నగరమంతా తాగునీటిని సరఫరా చేస్తున్నట్లు చెప్తున్న మున్సిపల్ ఆఫీసర్లు... ట్యాంకర్ల ద్వారా నీళ్లను ఎక్కడికి తరలిస్తున్నారని, ఆ ట్యాంకర్లలో డీజిల్ ఎందుకు పోస్తున్నారని నిలదీశారు. పట్టణ ప్రగతిలో లక్షలాది రూపాయలు వెచ్చించి ఖాళీ స్థలాలను క్లీన్ చేస్తున్నారని, అయినా మళ్లీ జేసీబీ, బ్లేడ్ ట్రాక్టర్ పేరిట డీజిల్ ఖర్చు చూపడంలో ఆంతర్యం ఏమిటన్నారు. ట్రాక్టర్లకు గతంలో ఉన్న జీపీఎస్, సీసీ టీవీలను ఎందుకు తీసేశారో చెప్పాలని అమీర్ డిమాండ్ చేశారు.