సీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వాలని పలుమార్లు గడువు పొడిగించినా స్పందిస్తలే..

సూర్యాపేట/యాదాద్రి/మిర్యాలగూడ, వెలుగు: ప్రభుత్వం కొనుగోలు చేసి సీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం మిల్లులకు కేటాయిస్తున్న వడ్లు పక్కదారి పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత మూడు సీజన్లకు సంబంధించి వేలాది క్వింటాళ్ల రైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రభుత్వానికి అప్పగించేందుకు మిల్లర్లు మొండికేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించినా మిల్లర్లలో మాత్రం స్పందన కనిపించడం లేదు. అయితే వడ్లను బియ్యంగా మార్చిన తర్వాత ప్రభుత్వానికి ఇవ్వకుండా బహిరంగ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అమ్ముకుంటున్నట్లు తెలుస్తోంది. సూర్యాపేట జిల్లాకు చెందిన ఓ మిల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూ. 32 కోట్ల విలువైన రైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మాయం చేసి చేతులెత్తేయడం, నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన మరో మిల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కేసు నమోదు కావడం ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మరికొందరు మిల్లర్లు కూడా ఇదే బాటలో ఉన్నట్లు సమాచారం.

మిల్లర్ల వద్దే కోట్ల విలువైన రైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

2020– -21 యాసంగి సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించి సూర్యాపేట జిల్లాలోని 72 మిల్లులకు 6,68,705 మెట్రిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టన్నుల వడ్లను కేటాయించారు. వీటిని మిల్లింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి 4,52,595 టన్నుల రైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందించాల్సి ఉండగా మిల్లర్లు ఇప్పటివరకు 4,33,715 టన్నుల బియ్యం ఇచ్చారు. ఇంకా 18,880 టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉంది. ఈ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించి 66 మిల్లులు 100 శాతం టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేరుకోగా, మరో ఆరు మిల్లుల నుంచి రైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంది. 2021–-22 వానాకాలం సీజన్‌‌కు సంబంధించి 3,64,409 టన్నుల వడ్లను 72 మిల్లులకు కేటాయించారు. ఈ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 2,44,154 టన్నుల రైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు 1,50,742 టన్నులు మాత్రమే ఇవ్వగా ఇంకా 93,141 మెట్రిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టన్నుల రైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిల్లుల్లోనే ఉంది. ఈ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 34 మిల్లులు మాత్రమే టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేరకు రైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వగా మరో 38 మిల్లులు బకాయి ఉన్నాయి. ఈ రెండు సీజన్లకు సంబంధించిన సీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గడువు గత నెలలోనే ముగిసింది. ఇక 2021 – 22 యాసంగికి సంబంధించి 2.15 లక్షల టన్నుల వడ్లను 47 మిల్లులకు కేటాయించారు. 1,45,168 టన్నుల రైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు 19,413 టన్నులు మాత్రమే ప్రభుత్వానికి అందింది. అలాగే యాదాద్రి జిల్లాకు సంబంధించి వానాకాలంలో 99,069 టన్నులు, యాసంగికి సంబంధించి 1,13,025 టన్నుల రైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంది. ఇక నల్గొండ జిల్లాకు సంబంధించి 2020 – 21 యాసంగిలో 108 మిల్లులకు 8.51 లక్షల టన్నుల వడ్లను అప్పగించారు. వీటికి సంబంధించి 5.75 లక్షల టన్నులు సీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వాల్సి ఉండగా 95 శాతానికిపైగా ప్రభుత్వానికి అందింది. 2021–22 వానాకాలం, యాసంగికి సంబంధించి 7.80 లక్షల టన్నుల వడ్లను ప్రభుత్వం మిల్లులకు అప్పగించింది. వీటిని మిల్లింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి 5.26 లక్షల టన్నుల రైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అప్పగించాలి. ఇందులో వానాకాలం సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించి 89 శాతం అంటే 2,71,179 టన్నులు అప్పగించగా 32,770 టన్నులు పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంది. అలాగే యాసంగికి సంబంధించి 2.22 లక్షల టన్నులు ఇవ్వాల్సి ఉండగా 79,634 టన్నుల రైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాత్రమే ఇచ్చారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మిల్లుల వద్ద పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న రైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విలువ రూ. 1200 కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తోంది.

మిల్లింగ్​ చేసి అమ్ముకుంటున్రు

ఉమ్మడి జిల్లాలో గత మూడు సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు సంబంధించిన సీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిల్లర్ల వద్దే పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వం కేటాయించిన వడ్లను మిల్లింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాక రైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇవ్వకుండా బహిరంగ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా మిల్లర్లు ఏడాది నుంచి ఏడాదిన్నర వరకు సీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వకుండా లేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. కొందరు మిల్లర్లు తర్వాతి సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వడ్లు వచ్చాక వాటిని మిల్లింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి గత సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంటూ ప్రభుత్వానికి అప్పగిస్తున్నారు. మరికొందరైతే అది కూడా ఇవ్వకుండా చేతులెత్తేస్తున్నారు. అయితే గతంలో సీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాయం చేశారన్న విమర్శలు వచ్చిన మిల్లులకు ఈ సారి ఆఫీసర్లు వడ్లు కేటాయించలేదు. దీంతో గతంలో పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న సీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను భర్తీ చేసేందుకు మిల్లర్లే నేరుగా రైతుల నుంచి పెద్ద మొత్తంలో వడ్లను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.