
ఈజీ మనీ కోసం కేటుగాళ్లు వేశాలు మార్చి అమాయకులను దోచుకుంటున్నారు. తాజాగా పోలీస్ డ్రెస్ లో వచ్చి వాహనాలు తనిఖీ చేస్తూ ఒక అమాయకుడి దగ్గర డబ్బులు కొట్టేశారు. బ్యాగ్ లో డబ్బు ఉండటం చూసి.. ఆ డబ్బుకు లెక్క చెప్పాల ప్రశ్నించి.. స్టేషన్ కు వచ్చి తీసుకెళ్లమని చెప్పి ఉడాయించారు. సదరు బాధితుడు స్టేషన్ కు వెళ్లి అడగగా అసలు వాళ్లు పోలీసులే కాదని తెలిసి షాక్ గురయ్యాడు. ఈ ఘటన సికింద్రాబాద్ బోయిన్పల్లిలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. కంటోన్మెంట్ బోయిన్ పల్లి పోలీస్టేషన్ పరిధిలోని నేతాజీ నగర్ లో అరుణ్ కుమార్.. గ్లోబర్ ప్రైవెట్ లిమిటెడ్ కంపెనీలో ఆఫీస్ బాయ్ గా పనిచేస్తున్నాడు. కంపేనీ మేనేజర్ ఐదు లక్షల రుపాయల బ్యాగు ఇచ్చి సుచిత్రలో అసిస్టెంట్ మేనేజర్ కు అప్పజెప్పి రావలని సూచించాడు. దీంతో శనివారం (మార్చి 23) రాత్రి బ్యాగ్ తో బయలు దేరిన అతన్ని బోయిన్ పల్లి హైవేపై పోలీస్ డ్రెస్ లో ఉన్న వ్యక్తి తో పాటు మరో వ్యక్తి అడ్డగించారు.
ALSO READ : తల్లి చనిపోయిందని సొంతూరుకి పోతే.. హైదరాబాద్లో ఇల్లు గుల్ల.. 25 తులాల బంగారం దోచుకెళ్లారు
వాహనం తనిఖీ చేయలంటూ ఆర్ సి, డ్రైవింగ్ లైసెన్స్ పరిశీలించారు. ఆ తర్వాత బ్యాగులో ఉన్న డబ్బు ఎవరిది అని ప్రశ్నించారు. వెంటనే యజమానికి కాల్ చేయగా పోలీస్టేషన్ కు వచ్చి డబ్బులు తీసుకెవెళ్ళమంటూ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయరు. వెంటనే పోలీస్టేషన్ కు వెళ్ళ అడగగా అక్కడ విధుల్లో ఎవరు లేరని తెలవడంతో షాక్ కు గురయ్యాడు. పోలీసుల రూపంలో వచ్చింది సూడో పోలీసులు అని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల సహాయంతో పాత నేరస్తుల జాబితాను పరిశీలిస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు బోయిన్ పల్లి పోలీసులు.