కామారెడ్డి, వెలుగు: స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించేందుకు గవర్నమెంట్ మన ఊరు మన బడి ప్రోగ్రామ్ చేపట్టింది. మొదట్లో హదావుడి చేసిన గవర్నమెంట్ తర్వాత అంతగా శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు ఉన్నాయి. మొదటి విడతలో కామారెడ్డి జిల్లాలో 351 స్కూళ్లను సెలెక్ట్ చేశారు. ఈ స్కూళ్లలో చేపట్టాల్సిన పనులపై 6 నెలల కింద ఎస్టిమేషన్‌వేసి ప్రపోజల్స్ పంపారు. బిల్డింగ్స్ శిథిలమైన చోట కొత్త నిర్మాణం, అవరమైన చోట అదనంగా క్లాస్‌రూమ్స్ నిర్మాణం, రిపేర్లు, కరెంట్ వైరింగ్, ఫ్లోరింగ్, వాటర్
ట్యాంకులు, కాంపౌండ్‌వాల్స్, కిచెన్ షెడ్స్ నిర్మాణం వంటి పనులు ఉన్నాయి. మొదటి విడతలో చేపట్టిన పనులకు రూ.160 కోట్లతో ఎస్టిమేషన్ వేశారు. ఇప్పటి వరకు కేవలం రూ.4.50 కోట్ల ఫండ్స్ వచ్చాయి. 351 స్కూళ్లలో రూ. 30 లక్షల లోపు వర్క్స్ ఉన్నాయి. 247 స్కూళ్లలో రూ. 2 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు పనులు ఉన్నాయి.
93 స్కూళ్లలో టెండర్ల దశలోనే..
104 స్కూళ్లలో రూ. 30 లక్షల కంటే ఎక్కువ అమౌంట్‌తో పనులు చేయాల్సి ఉంది. వీటికి టెండర్లు పిలిచారు. ఇప్పటి వరకు కేవలం 11 పనులకు సంబంధించి టెండర్ల పక్రియ కంప్లీట్ అయ్యింది. 93 స్కూళ్లలో ఇంకా టెండర్ల పక్రియ కంప్లీట్ కాలేదు. ఫండ్స్ లేకపోవడంతో టెండర్ల పక్రియలో డిలే అవుతున్నట్లు తెలుస్తోంది.
పరిస్థితి ఇది...
జిల్లాలో 247 స్కూళ్లలో రూ. 30 లక్షల లోపు అమౌంట్ పనులు చేపడితే ఇందులో 22 స్కూళ్లలో మాత్రమే ఇప్పటి వరకు మైనర్వర్క్స్కంప్లీట్ అయ్యాయి. రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షలతో చేపట్టాల్సిన మైనర్ రిపేర్లు మాత్రమే కంప్లీట్ చేశారు. ఫ్లోరింగ్, కరెంట్ వైరింగ్, వాటర్ ట్యాంక్ నిర్మాణం, బిల్డింగ్ రిపేర్పనులు మాత్రమే కంప్లీట్ చేశారు. కామారెడ్డి నియోజక వర్గంలో 7, జుక్కల్‌లో 14, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఒక స్కూల్‌లో మాత్రమే మైనర్ రిపేర్లు కంప్లీట్ అయ్యాయి.
ఇది కామారెడ్డి మండలం తిమ్మక్‌పల్లి ప్రైమరీ స్కూల్. బిల్డింగ్ పైభాగం, ఫ్లోరింగ్ శిథిలమైంది. మన ఊరు మన బడిలో రూ.5.04 లక్షలతో రిపేర్‌కు ప్రప్రోజల్స్ పంపారు. ఉన్నతాధికారులు పనులకు అమోధం తెలిపారు. స్కూల్ మెనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ) ఆధ్వర్యంలో పనులు షూరు చేశారు. క్లాస్ రూమ్స్పైన రిపేర్లు, గోడ నిర్మాణం, క్లాస్ రూమ్స్‌లో ఫ్లోరింగ్ గ్రానైట్ వేశారు. మెట్ల నిర్మాణం జరిగింది. పనుల కోసం ఎస్ఎంసీ అకౌంట్‌లో ఇటివల రూ.లక్ష 40 వేలు జమ అయ్యింది. రూ.40 వేల పెమేంట్జరిగింది. తక్కువ అమౌంట్‌తో మైనర్ వర్క్స్ ఇక్కడ జరిగాయి.
ఇది కామారెడ్డి టౌన్‌లోని ఎస్సీ వాడలోని హైస్కూల్. ఇదే స్కూల్ ఆవరణలో ప్రైమరీ స్కూల్ కూడా ఉంది. హైస్కూల్‌లో 6 నుంచి 10 వ తరగతి వరకు 170 మంది స్టూడెంట్లు ఉన్నారు. స్కూల్ బిల్డింగ్ శిథిలమైంది. స్టూడెంట్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే ఆవరణలో ప్రైమరీ స్కూల్‌లో 103 మంది పిల్లలు ఉన్నారు. ఈ రెండు స్కూల్లకు క్లాస్‌రూమ్స్ ప్రాబ్లమ్ ఉంది. ఈ పనులకు సంబంధించి టెండర్లు ఇంకా ఖరారు కాలేదు.
ఎస్‌ఎంసీ అకౌంట్లలో జమ చేశాం
మన ఊరు మన బడికి సంబంధించి రూ. 4.50 కోట్ల ఫండ్స్ వస్తే వాటిని ఎస్ఎంసీ అకౌంట్లలో జమ చేశాం. ఒక్కో దాంట్ల రూ. లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు వేశాం. పనులు త్వరగా కంప్లీట్ అయ్యేలా చూస్తున్నాం. టెండర్ల పక్రియ కూడా ఉన్నతాధికారుల ఆదేశాలతో చేయిస్తాం.
– రాజు, డీఈవో, కామారెడ్డి