
అమ్రాబాద్, వెలుగు: వేసవి తీవ్రత పెరగడంతో నల్లమల అభయారణ్యంలో తరచుగా మంటలు చెలరేగుతున్నాయి. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని జీలుగాయకుంట అటవీ ప్రాంతంలో బుధవారం సాయంత్రం నిప్పంటుకొని అడవి దగ్ధమవుతున్నట్లు శాటిలైట్ ద్వారా సమాచారం అందిందని ఎఫ్ఆర్వో ప్రభాకర్ తెలిపారు. అప్రమత్తమైన ఫారెస్ట్ సిబ్బంది, ఫైర్ ప్రొటెక్షన్ వాచర్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు కృషి చేస్తున్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని, 100 హెక్టార్లలో గడ్డి కాలిపోయినట్లు ఎఫ్ఆర్వో తెలిపారు.