రంగారెడ్డి జిల్లాలో కోతులు బెడద రోజు రోజుకు ఎక్కువవుతుంది. రాజేంద్రనగర్ లోని అత్తాపూర్ డివిజన్ ఎర్రబోడలో కోతులతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. గ్రామంలో 15 రోజుల నుంచి కోతులు స్వైర విహారం చేయడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఒంటరిగా భయటకు రావాలంటే వణికిపోతున్నారు.
ఈరోజు(నవంబర్ 06) ఉదయం పాఠశాలలోకి ప్రవేశించిన కోతులు.. ఇద్దరు విద్యార్థులకు విచక్షణ రహితంగా కరిచాయని ఉపాధ్యాయులు తెలిపారు. కోతుల దాడుల్లో గాయపడిన చిన్నారులను ఆసుపత్రికి తరలించారు. దీంతో విద్యార్థులు స్కూల్ అంటే భయపడుతున్నారని తెలిపారు.
Also Read :- ప్రైవేటు బస్సులో భారీగా గంజాయి పట్టివేత
కోతుల సమస్యను పరిష్కరించాలని స్థానికులు అధికారులకు ఎన్నిసార్లు విన్నమించుకున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు వెటర్నరీ అధికారులు బోనులు ఏర్పాటు చేసి కోతులను పట్టే పనిలో పడ్డారు.