అంతర్గత విభేదాలు లేవు..ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంది:కాంగ్రెస్ కొత్త ఇంచార్జి మీనాక్షి నటరాజన్

అంతర్గత విభేదాలు లేవు..ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంది:కాంగ్రెస్ కొత్త ఇంచార్జి మీనాక్షి నటరాజన్

హైదరాబాద్: పార్టీలో ఎలాంటి అంతర్గత విభేదాలు లేవు.. మా పార్టీలోనే ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉందని అన్నారు కాంగ్రెస్ పార్టీ కొత్త ఇంచార్జీ మీనాక్షి నటరాజన్. తెలంగాణలో పనిచేసే అవకాశం వచ్చింది.. పీసీసీ చీఫ్, సీఎం, ఇతర నేతలు, కార్యకర్తలను కలుపుకొని పనిచేస్తానన్నారు మీనాక్షీ నటరాజన్. పార్టీ పటిష్టతకు, రాజ్యాంగ పరిరక్షణకు అందరం కలిసి పనిచేస్తామన్నారు. పార్టీ అధిష్టానం ఇచ్చిన బాధ్యతలను నెరవేరుస్తానని చెప్పారు. 

రాహుల్ గాంధీ ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లఢానికి కృషి చేస్తాననన్నారు మీనాక్షి నటరాజన్. పార్టీలో అంతర్గత రాజకీయాలు లేవు..ప్రజాస్వామ్యం కాంగ్రెస్ లో ఎక్కువ..పార్టీలో భిన్నాభిప్రయాలు ఉంటాయి.. అందరి అభిప్రాయాలకు సముచితస్థానం కల్పిస్తూ ముందుకెళ్తామన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఏ ఉద్దేశ్యంతో ఏర్పాటు చేశారో..ఆ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. 

ఇక కొత్త ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ చాలా సాదా సీదా వ్యక్తి. దిల్ కుష్ తో కార్యాలయ బయట కార్యకర్తలను కలిసి విష్ చేశారు. బొకేలు ఇస్తుంటే నిరాకరించారు.