కాంగ్రెస్​ సెకండ్​ లిస్ట్​లో ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు

ఖమ్మం/భద్రాద్రికొత్తగూడెం/మణుగూరు, వెలుగు : కాంగ్రెస్​హైకమాండ్​శుక్రవారం ప్రకటించిన సెకండ్​లిస్ట్​లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు ఉన్నారు. పాలేరు టికెట్​ను మాజీ ఎంపీ, కాంగ్రెస్​ప్రచార కమిటీ కో చైర్మన్​పొంగులేటి శ్రీనివాస్​రెడ్డికి, ఖమ్మం టికెట్​ను మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు, పినపాక టికెట్​ను మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు కేటాయించింది. ఇప్పటికే ఈ ముగ్గురు నేతలు ఆయా నియోజకవర్గాల్లో జోరుగా ప్రచారం చేస్తున్నారు.

మద్దతు కూడగడుతున్నారు. ఇప్పటికే ఫస్ట్​లిస్ట్​లో మధిర నుంచి మల్లు భట్టివిక్రమార్క, భద్రాచలం నుంచి పొదెం వీరయ్య పోటీ చేయనున్నట్లు తెలిపింది. మిగిలిన ఐదు నియోజకవర్గాలపై క్లారిటీ రావాల్సి ఉంది. . పినపాక నుంచి ఇతరుల పేర్లు వినిపించినా, పొంగులేటి అనుచరుడిగా గుర్తింపు పొందిన పాయం వెంకటేశ్వర్లుకే హైకమాండ్​ చాన్స్ ఇచ్చింది.