- కల్తీ కల్లు ఇష్యూపై హైడ్రామా
- హాస్పిటల్లోనే బాధితులు
- మూడుకు చేరిన మరణాలు
- హాస్పిటల్‌ను సందర్శించిన అధికార, ప్రతిపక్షాల లీడర్లు
మహబూబ్‌నగర్, వెలుగు : కల్తీకల్లు ఇష్యూపై ఆరు రోజులుగా పాలమూరులో ఎవరూ సప్పుడు చేయలేదు. ఆదివారం ఆశన్న, బుధవారం విష్ణు ప్రకాశ్, రేణుక మృతి చెందడం, మరి కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు హాస్పిటల్లో హైడ్రామా నడిచింది.
పోటాపోటీగా ప్రెస్మీట్లు, పరామర్శలు
కల్తీకల్లు ఎఫెక్ట్‌తో ముగ్గురు చనిపోవడంతో అపోజిషన్పార్టీలు అలర్టయ్యాయి. బుధవారం పీసీసీ జనరల్ సెక్రటరీ ఎస్.వినోద్‌కుమార్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి వేర్వేరుగా ప్రెస్మీట్నిర్వహించారు. అనంతరం బీజేపీ లీడర్లు జనరల్ హాస్పిటల్‌ను విజిట్‌చేసి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సాయంత్రం నాలుగున్నర గంటలకు ఎక్సైజ్‌శాఖా మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్ హాస్పిటల్‌ను విజిట్‌చేసి, అక్కడే విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సైతం సాయంత్రం ప్రెస్మీట్లో మాట్లాడారు.
హాస్పిటల్లోనే బాధితులకు సెటిల్మెంట్
కల్తీకల్లు విషయం బయటకు రాకుండా హాస్పిటల్లోనే బాధితులకు ఆదివారం సెటిల్మెంట్ చేసినట్లు తెలిసింది. ముందుగా ఒక్కో బాధిత కుటుంబానికి రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఇచ్చారని సమాచారం. డిశ్చార్జ్అయ్యాక పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టజెప్తామని హామీ ఇచ్చారనే టాక్ నడుస్తోంది. దీనికి తోడు ఆదివారం ఆశన్న అనే వ్యక్తి మృతి చెందగా, ఆయన కుటుంబానికి సెటిల్మెంట్చేసినట్లు తెలిసింది. ఈయన పేరు మీద పొలం ఉండటంతో.. కల్తీకల్లు తాగి చనిపోతే 'రైతుబీమా' రాదని ఓ మధ్యవర్తి భయపెట్టించి అంత్యక్రియల కోసం రూ.30 వేలు ఇచ్చి కేసును డైవర్ట్ చేసినట్లు సమాచారం.
ఎవరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వొద్దని ఆర్డర్లు..
శుక్రవారం నుంచి బాధితులు హాస్పిటల్‌కు వస్తున్నా సమాచారం బయటకు రావడం లేదు. ఈ విషయంపై ఆసుపత్రి వర్గాలకు స్ట్రిక్ట్ ఆర్డర్లు వచ్చినట్లు సమాచారం. దీంతో వారు ఇన్ఫర్మేషన్ను బయటకు చెప్పడం లేదు. బాధితులు ఎవరెవరూ ఉన్నారు? ఎక్కడి నుంచి వస్తున్నారు? అస్వస్థతకు కారణాలేంటి? అనే విషయాలను సీక్రెట్‌గా ఉంచుతున్నారు. వారిని అడ్మిట్ చేసిన తర్వాత కేస్షీట్లలో కల్తీకల్లు తాగడం వల్లే ఇలా ప్రవర్తిస్తున్నానే విషయాన్ని ప్రస్తవించారు. కానీ, బయటకు మాత్రం డీ హైడ్రేషన్ వల్ల ఇలా చేస్తున్నారని ప్రకటిస్తున్నారు.
రిజల్ట్ఎప్పుడొస్తదో?
కల్తీ కల్లు వ్యవహారంపై సోమవారం ఎక్సైజ్ఆఫీసర్లు విలేకర్ల సమావేశం నిర్వహించి, వివరాలు వెల్లడించారు. అయిదు షాపుల్లో శ్యాంపిల్స్ సేకరించామని చెప్పారు. డీహైడ్రేషన్ వల్లే బాధితులు ఇలా ప్రవరిస్తున్నారని డాక్టర్లు చెబుతున్నారనే విషయాన్నే వీరు చెప్పారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. అసలు శ్యాంపిల్స్తీసుకున్న రిజల్ట్ఎప్పుడొస్తుందనే దానిపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
దందాలో పొలిటికల్ లీడర్లు
గతంలో దందా నిర్వహించే వ్యాపారులు పొలిటికల్ లీడర్లకు నెలనెలా వాటాలు ఇచ్చే వారు. ప్రస్తుతం వ్యాపారులే లీడర్లుగా చలామణి అవుతుండటంతో సమస్య వచ్చినప్పుడల్లా వారి పలుకుబడి ఉపయోగిస్తున్నారు. పోలీస్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ను వారి జోలికి రాకుండా మేనేజ్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. హయ్యర్ అఫీషియల్స్, పొలిటికల్ లీడర్ల నుంచి దాడులు చేయొద్దనే ఒత్తిళ్లు వస్తుండటంతో ఆఫీసర్లు సైతం మౌనంగా ఉంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
కొత్తగా ఎవరూ అడ్మిట్కాలేదు..
అస్వస్థతకు గురైన వారికి జీజీహెచ్‌లో మెరుగైన ట్రీట్మెంట్ అందిస్తున్నాం. ప్రస్తుతం హాస్పిటల్లో అడ్మిట్ అయిన వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. మంగళ, బుధవారాల్లో కొత్తగా ఈ సింటమ్స్ తో ఎవరూ అడ్మిట్ కాలేదు.
- రాంకిషన్, జనరల్హాస్పిటల్సూపరింటెండెంట్, మహబూబ్‌నగర్