రైతులకు, పశువుల కాపరులకు గొడవలే హింసకు కారణం?
అబూజ (నైజీరియా) : సెంట్రల్ నైజీరియాలో భూముల విషయంలో రైతులకు, పశువుల కాపరులకు మధ్య గొడవలు దారుణమైన హింసకు దారితీశాయి. బెన్యూ స్టేట్లోని ఉమోగిడి గ్రామంలోకి తుపాకులతో చొరబడిన కొందరు దుండగులు గ్రామస్తులపై విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 50 మంది మృత్యువాతపడ్డారు. స్థానిక రైతులకు, పశువుల కాపరులకు మధ్య ఉన్న గొడవలే ఈ హింసకు దారి తీసి ఉంటాయని భావిస్తున్నారు. ముందుగా మంగళవారం ముగ్గురు గ్రామస్తులను దుండగులు కాల్చి చంపారు. బుధవారం ఆ ముగ్గురికి అంత్యక్రియలు నిర్వహించడం కోసం గ్రామస్తులు గుమిగూడిన సమయంలో మరికొందరు దుండగులు వచ్చి కాల్పులు జరిపారు.