- ఆప్షన్ఫామ్లు సబ్మిట్చేసిన సెక్రటరీలు
మెదక్, వెలుగు: ప్రభుత్వం ట్రాన్స్ఫర్స్పై బ్యాన్ఎత్తి వేయడంతో జిల్లా పంచాయతీ ఆఫీస్లో ట్రాన్స్ఫర్స్ సందడి నెలకొంది. జిల్లాలోని 21 మండలాల పరిధిలో మొత్తం 469 గ్రామ పంచాయతీలు ఉండగా 459 మంది సెక్రటరీలు పనిచేస్తున్నారు. 10 సెక్రటరీ పోస్ట్లు ఖాళీగా ఉన్నాయి. ఒకే చోట నాలుగేళ్లుగా పనిచేస్తున్నసెక్రటరీలలో 40 శాతం మంది ట్రాన్స్ఫర్స్కు అవకాశం ఉంది.
గ్రేడ్- 4 సెక్రటరీలు మొత్తం 333 మంది ఉన్నారు. వీరిలో నాలుగేళ్లకుపైగా ఒకే చోట పనిచేస్తున్నవారు 204 మంది ఉండగా 40 శాతం లెక్కన 133 మందికి ఎలిజబిలిటీ ఉంది. గ్రేడ్1లో ఇద్దరు, గ్రేడ్-2 లో ఇద్దరు, గ్రేడ్3లో 9 మందికి ట్రాన్స్ఫర్ఎలిజిబిలిటీ ఉంది. ఈ మేరకు వారి నుంచి ఆప్షన్ఫామ్లు తీసుకున్నారు. శుక్రవారం ఆప్షన్ ఫామ్ల సబ్మిషన్కు చివరి రోజు కావడంతో సెక్రటరీలు డీపీవో ఆఫీస్కు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో అక్కడ సందడి నెలకొంది. ఈ నెల 13 నుంచి 18 వరకు వెరిఫికేషన్, కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగుతుందని డీపీవో యాదయ్య తెలిపారు. సీనియారిటీ, మెరిట్ ప్రకారం ట్రాన్స్ఫర్స్ కౌన్సిలింగ్పారదర్శకంగా నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఈనెల 20 వరకు సెక్రటరీల ట్రాన్స్ఫర్స్ప్రాసెస్ కంప్లీట్అవుతుందన్నారు.