
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీకి ఇటీవలే రాజీనామా చేసిన కీలక నేత విజయసాయిరెడ్డి. జగన్ చుట్టూ కోటరీ ఉందనీ.. కోటరీ వల్లే జగన్కు దురమయ్యానని అన్నారు. చుట్టూ ఉన్న వాళ్ల మాటలు వినొద్దని జగన్కు చెప్పానని, కానీ ఆయన తన మాటలు వినలేదని చెప్పారు. తనకు, జగన్ కు విభేదాలు సృష్టించింది కోటరీలోని వాళ్లే విమర్శించారు.
‘‘ మీ మనసులో నాకు స్థానం లేదు.. అందుకే పార్టీని వీడుతున్నా’’ అని జగన్కి చెప్పానని విజయసాయిరెడ్డి అన్నారు. ‘‘ నా మనసు విరిగిపోయింది కాబట్టే పార్టీ నుంచి బయటకు వచ్చా.. విరిగిన మనసు మళ్లీ అతుక్కోదు.. నేను వైసీపీలో చేరను’’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్ తనను పార్టీలో ఉండమన్నారని, కానీ తన మనసులో స్థానం లేనపుడు ఆ పార్టీలో ఎలా ఉంటానని అన్నారు. మళ్లీ వైసీపీ ఘర్ వాపసీ ఉండదని స్పంష్టం చేశారు. తాను ప్రలోభాలకు లొంగిపోయనని జగన అన్నారని, కానీ తాను ఏ ప్రలోభాలకు లొంగలేదు తెలిపారు.
Also Read:-రిలీజ్ టైంలో పోసానికి బిగ్ షాక్ : సీఐడీ కేసులో 14 రోజుల రిమాండ్..
ఏపీ లిక్కర్ స్కాం కర్త, కర్మ, క్రియ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని చెప్పినట్లు తెలిపారు. కేవీ రావుతో ఎలాంటి సంబంధం లేదని, కేవీరావుతో ముఖపరిచయం తప్ప ఎలాంటి ఆర్థిక సంబంధాలు లేవని స్పష్టం చేశారు. అరబిందో వ్యాపారాల్లోనూ ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని, విక్రాంత్‌రెడ్డి తెలుసా.. అని అడిగారని, సుబ్బారెడ్డి కుమారుడిగా తెలుసు అని చెప్పినట్లు తెలిపారు. విక్రాంత్‌రెడ్డిని కేవీరావుకు పరిచయం చేయాల్సిన అవసరం తనకు లేదని అన్నారు -విజయసాయిరెడ్డి.