నా రాజీనామా వెనక బలమైన రీజన్ ఉంది

నా రాజీనామా వెనక బలమైన రీజన్ ఉంది

ఎన్నికల రిజల్ట్ వచ్చినా కూడా ‘మా’ వేడి తగ్గడం లేదు. రిజల్ట్ తర్వాత సోమవారం ప్రకాశ్ రాజ్ తన మా సభ్యత్వానికి రాజీనామా చేశారు.  అయితే  ప్రకాశ్ రాజ్ రాజీనామాను ఆమోదించనని మంచు విష్ణు చెప్పారు. అయినా ప్రకాశ్ రాజ్ వెనక్కి తగ్గడం లేదు. మరోసారి తన ట్విట్టర్లో తన రాజీనామాపై స్పందించారు. మా సభ్యత్వానికి రాజీనామా చేయడం వెనక బలమైన కారణముందన్నారు.  ఇంతకీ ఆయన ట్వీట్ ఏంటంటే..‘ తమ వెంట నిలిచిన మా సభ్యులందరికీ నమస్కారం. నేను రాజీనామా చేయడం వెనుక లోతైన అర్థం ఉంది. త్వరలో వివరిస్తా. ఇన్నాళ్లు  నాకు అండగా ఉన్న వారి నమ్మకాన్ని వమ్ముచేయము. మీరు మా గురించి గర్వపడతారు’ అని ట్వీట్ చేశారు ప్రకాశ్ రాజ్.