హైదరాబాద్ శంషాబాద్ నుంచి బెంగళూరు జాతీయ రహదారి తొండూపల్లి వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి రోడ్డు మీద గుంతల్లో నీరు నిలిచింది. దీంతో దాదాపు 4కిలోమీటర్ల మేరా వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. మరోవైపు తొండుపల్లి జాతీయ రహదారి ఫ్లైఓవర్ పనుల నత్త నడకన జరుగుతున్నాయి. దీనివల్ల కూడా వాహనాల రద్దీ ఎక్కువైంది. వాహనదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్ టోల్గేట్ ఎగ్జిట్, జాతీయ రహదారి రెండూ ఒకే దగ్గర ఉండడంతో రోడ్డు ఇరుకుగా మారి.. వాహనాలు ముందుకు వెళ్లడం లేదు. రాత్రి నుంచి ట్రాఫిక్ స్తంభించింది.