మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఉద్రిక్తత ఇప్పట్లో తగ్గేలా లేదు. గర్ల్స్ హాస్టల్ బాత్‌రూమ్‌లో కెమెరాలు అమర్చి రహస్యంగా వీడియోలు చిత్రీకరించారని విద్యార్థినులు బుధవారం (1 జనవరి 2025) నుండి తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు.
విద్యార్థుల ఆందోళనలకు విద్యార్తి సంఘాలు మద్ధతు తెలుపాయి. ఎన్ఎస్ యూఐ (NSUI) నాయకులు విద్యార్థుల సమస్యను తెలుసుకొని లేడీస్ హాస్టల్ ఎదుట విద్యార్థులతో పాటు ఆందోళనకు దిగారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు.
కాలేజీలో జరుగుతున్న ఆందోళనల గురించి తెలుసుకొని విద్యార్థినుల తల్లిదండ్రులు హాస్టల్ కు చేరుకున్నారు. తల్లిదండ్రులను చూడగానే విద్యార్థులు బోరున విలపించారు. హాస్టల్ లో జరిగిన ఘటనల గురించి తల్లిదండ్రులకు తెలిపి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు విద్యార్థినులు.
విషయం తెలుసుకున్న మేడ్చల్ ఏసీపీ శ్రీనివాసరెడ్డి బందోబస్తుతో సీఎంఆర్ కాలేజ్ హాస్టల్ కు చేరుకున్నారు. విద్యార్థినుల తల్లిదండ్రులతో మాట్లాడిన ఏసీపీ విద్యార్థినులను శాంతిపజేయాలని కోరారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే వరకు ఆందోళన విరమించేది లేదని ఆందోళన ఉధృతం చేశారు విద్యార్థులు.
‘‘వి వాంట్ జస్టిస్’’ అంటూ సీఎంఆర్ కాలేజ్ హాస్టల్ ముందు బైటయించి విద్యార్థులు తీవ్ర స్థాయిలో ఆందోళనకు దిగారు విద్యార్థులు. హాస్టల్ వార్డెన్ ప్రీతి బైటకు రావాలంటూ నినదిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు విద్యార్థినులు.