శ్రీశైలం ఎడమగట్టు కాలువ (SLBC) ప్రమాద ఘటన చాలా విషాధకరమని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. ఈ ఘటనలో టన్నెల్ లో చిక్కుకున్న కార్మికులు బయటకు వస్తారని ఎక్కడో చిన్న ఆశ ఉందన్నారు. వారిని రక్షించడమే తమ ముందున్న బాధ్యత అని, కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.

ఇంత పెద్ద ప్రమాదం గతంలో ఎప్పుడూ జరగలేదని, కార్మికులు బయటికి వస్తారనే ఆశ ఉందని తెలిపారు మంత్రి కోమటి రెడ్డి. కార్మికులు వందల కిలోమీటర్ల దూరం దాటి పని కోసం వచ్చారని, వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.
Also Read:-మందకృష్ణ మాదిగను మోదీ కౌగిలించుకున్నారు.. కానీ వర్గీకరణ చేయలేదు..
సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే హక్కు బీఆర్ఎస్ నాయకులకు లేదని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. సీఎం రేవంత్ బీఆర్ఎస్ నేతల్లగా ఏళ్ల తరబడి ఫామ్ హౌజ్ లో పడుకోలేదని ఎద్దేవా చేశారు. తమను పంపించి సహాయక చర్యలు సమీక్షిస్తున్నారని తెలిపారు. ట్విట్టర్ ఉంది కదా అని కేటీఆర్ ఏది పడితే అది పోస్టులు పెడుతున్నారని, ప్రమాదాన్ని రాజకీయం చేయాలనుకుంటే అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు.