సికింద్రాబాద్‎లో తీవ్ర ఉద్రిక్తత.. ఆందోళనలతో దద్దరిల్లిన ముత్యాలమ్మ టెంపుల్ ప్రాంగణం

సికింద్రాబాద్‎లో తీవ్ర ఉద్రిక్తత.. ఆందోళనలతో దద్దరిల్లిన ముత్యాలమ్మ టెంపుల్ ప్రాంగణం

హైదరాబాద్: సికింద్రాబాద్‎లోని కుమ్మరిగూడలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కుమ్మరిగూడ ముత్యాలమ్మ టెంపుల్లో అమ్మవారి విగ్రహం ధ్వంసం ఘటనకు నిరసనగా 2024, అక్టోబర్ 19న హిందూ సంఘాలు బంద్‎కు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో అమ్మవారి ఆలయం వద్దకు చేరుకుని హిందు సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. టెంపుల్ వెనకాల ఏరియాలో ఓ మసీదు వైపు చొచ్చుకెళ్లేందుకు నిరసనకారులు ప్రయత్నం చేయగా.. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, నిరసనకారులకు మధ్య తీవ్ర వాగాద్వం చోటు చేసుకుంది. ఘటన స్థలంలో పరిస్థితి అదుపు తప్పడంతో నిరసకారులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయగా.. తీవ్ర ఆగ్రహానికి గురైన నిరసనకారులు పోలీసులపై రాళ్లు, చెప్పులు రువ్వారు. ముత్యాలమ్మ టెంపుల్ ప్రాంగణం నిరసనకారులతో అట్టుడుకుతుండటంతో భారీగా పోలీసులను మోహరించారు.

కాగా, కుమ్మరిగూడ ముత్యాలమ్మ టెంపుల్లో అమ్మవారి విగ్రహం ధ్వంసం ఘటనకు నిరసనగా హిందూ సంఘాలు బంద్‎కు పిలుపునిచ్చాయి. సికింద్రాబాద్ లోని పలు మార్కెట్లో దుకాణాలు.. హోటళ్ల తోపాటు వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా మూసివేసి బంద్ పాటించారు. ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహం ధ్వంసానికి నిరసనగా మహంకాళి టెంపుల్ నుండి వేల సంఖ్యలో హిందూ సంఘాల నాయకులు ఆందోళన చేస్తూ నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. హిందూ ప్రజలు స్వచ్ఛందంగా షాప్స్ బంద్ పెట్టి నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. కుమ్మరిగూడ ముత్యాలమ్మ టెంపుల్‎లోని అమ్మవారి విగ్రహాన్ని ఓ వ్యక్తి విగ్రహ ధ్వంసం చేయడంతో అట్టుడికిన హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాజకీయాలకు అతీతంగా హిందువులు నిరసన ర్యాలీలో పాల్గొని జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తిస్తూ 
హోరెత్తించారు.

హిందు సంఘాల ర్యాలీతో సికింద్రాబాద్ రాష్ట్రపతి(RP) రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వేల సంఖ్యలో నిరసనకారులు ఆర్పీ రోడ్డు బాటా చౌరస్తా మధ్యలో కూర్చొని నిరసన తెలుపుతుండడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రోడ్డుపై బైఠాయించిన నిరసనకారులను కాలి చేయించి ట్రాఫిక్‎ను క్లియర్ చేశారు పోలీసులు. హిందూ సంఘాల నిరసనకారులు మహంకాళి టెంపుల్ నుండి మోండా మార్కెట్ మీదుగా కుమ్మరిగూడ ముత్యాలమ్మ ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన ర్యాలీలో మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్‎తో పాటు స్థానిక బీజేపీ కార్పొరేటర్లు.. హిందూ సంఘాల నాయకులు ప్రజలు పాల్గొన్నారు.