వేంసూరు, వెలుగు : ఖమ్మం జిల్లా వేంసూర్ మండలంలో కరెంట్షాక్కు గురైన తల్లిని కాపాడబోయి కొడుకు మృతి చెందాడు. భీమవరం గ్రామానికి చెందిన ఐనంపూడి సరోజిని కొడుకు వెంకటేశ్వరరావు(28). డెయిలీ కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని చూసుకుంటున్నాడు. సోమవారం ఉదయం సరోజిని ఇంట్లోని ఫ్యాన్ స్విచ్ ఆన్చేయబోగా కరెంట్షాక్కొట్టింది. గమనించిన వెంకటేశ్వరరావు తల్లిని కాపాడే ప్రయత్నంలో పక్కనే ఉన్న కర్రతో తల్లి చేయి మీద కొట్టాడు. సరోజిని కింద పడిపోయింది.
ALSO READ:ఆఫీసర్ల తప్పులు.. రైతులకు తిప్పలు
అయితే అప్పటికే ఆ కర్ర తడిచి ఉండడం, తల్లిని కాపాడే క్రమంలో కర్ర పోయి కరెంట్ బోర్డు మీద పడింది. వెంకటేశ్వరరావు షాక్కు గురై కుప్పకూలాడు. స్థానికులు కాపాడే ప్రయత్నం చేయగా అప్పటికే మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సత్తుపల్లిలోని ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. మృతదేహానికి స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య నివాళులర్పించారు.